హైదరాబాద్లోని మాదాపూర్లో హైడ్రా పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నవంబరు 11న ప్రారంభించినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
చెరువు విస్తీర్ణాన్ని 14 ఎకరాల నుంచి 30 ఎకరాలకు పెంచినట్లు ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చెప్పారు. చెరువు నిర్వహణలో సైబరాబాద్ మున్సిపల్ యంత్రాంగం, ఇందిరా మహిళా శక్తి సంఘాలు భాగస్వాములు కావాలని సూచించారు. మహిళా సంఘాలు అక్కడ స్టాళ్లు నిర్వహించేలా చూడాలని ప్రతిపాదించారు.

KROV · సంభాషణ
వ్యాఖ్యలు
గౌరవంగా మీ అభిప్రాయాన్ని పంచుకోండి. సమీక్ష తర్వాత వ్యాఖ్యలు కనిపిస్తాయి. వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దు.