చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌పై నిషేధాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పొడిగించిందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) నవంబరు 13న తెలిపింది. జాకిర్ నాయక్ నేతృత్వంలోని ఈ ఫౌండేషన్‌ను చట్టవిరుద్ధ సంఘంగా మంత్రిత్వ శాఖ మరోసారి ప్రకటించింది.
నవంబరు 13న భారత గెజిట్‌లో ప్రచురించిన ప్రకటన ప్రకారం ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చింది. ప్రచురించిన తేదీ నుంచి ఐదేళ్ల పాటు ఇది వర్తిస్తుంది. అయితే చట్టంలోని సెక్షన్ 4 కింద జారీ అయ్యే ఉత్తర్వులకు ఇది లోబడి ఉంటుంది. మునుపటి నిషేధం గడువు నవంబరు 14న ముగియాల్సి ఉందని గెజిట్ ప్రకటన పేర్కొంది.

KROV · సంభాషణ
వ్యాఖ్యలు
గౌరవంగా మీ అభిప్రాయాన్ని పంచుకోండి. సమీక్ష తర్వాత వ్యాఖ్యలు కనిపిస్తాయి. వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దు.