మహారాష్ట్రలోని బుల్ఢాణా జిల్లాలో ఉన్న లోనార్ సరస్సు బిలానికి అంతర్జాతీయ భూవారసత్వ గుర్తింపు లభించింది. అంతర్జాతీయ భూవిజ్ఞాన శాస్త్రాల సంఘం తన జాబితాలో కొత్తగా చేర్చిన 100 ప్రదేశాల్లో ఈ బిలం ఒకటి. మూడో విడత జాబితాను ఆ సంఘం నవంబరు 6న ప్రకటించింది. లోనార్కు గుర్తింపు లభించినట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) నవంబరు 13న వెల్లడించింది. ఈ బిలాన్ని జాబితాలో చేర్చాలని భారత భూవిజ్ఞాన సర్వే సంస్థ ప్రతిపాదించింది.
వార్తలుకథనం
అంతర్జాతీయ భూవారసత్వ జాబితాలో లోనార్ సరస్సు బిలం
క్రోవ్ న్యూస్‌రూమ్
వ్యాఖ్యలువార్తల వెనుక కథ.

KROV · సంభాషణ
వ్యాఖ్యలు
గౌరవంగా మీ అభిప్రాయాన్ని పంచుకోండి. సమీక్ష తర్వాత వ్యాఖ్యలు కనిపిస్తాయి. వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దు.