
general · text
21 అక్టోబర్ 2026 | వార్త
దుర్గామాత విగ్రహాల నిమజ్జనాల సందర్భంగా హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అక్టోబర్ 21 మధ్యాహ్నం 3 గంటల నుంచి అక్టోబర్ 24 ఉదయం 6 గంటల వరకు ఈ ఏర్పాట్లు ఉంటాయి. పీపుల్స్ ప్లాజా, గార్డెన్ పాయింట్, జలవిహార్, సంజీవయ్య పార్క్ నిమజ్జన ప్రాంతాల వద్ద మళ్లింపులు ఉండనున్నాయి.
వాహనాల రద్దీని బట్టి ఆంక్షలను సర్దుబాటు చేస్తారు. నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, లిబర్టీ, సచివాలయం సమీప రహదారుల్లో ప్రయాణించేవారు అదనపు సమయం కేటాయించుకుని పోలీసుల సూచనలు పాటించాలి.
లోడ్ అవుతోంది…
KROV · సంభాషణ
వ్యాఖ్యలు
గౌరవంగా మీ అభిప్రాయాన్ని పంచుకోండి. సమీక్ష తర్వాత వ్యాఖ్యలు కనిపిస్తాయి. వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దు.