భారత వారసత్వ సంపదను డిజిటల్ రూపంలో నమోదు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ నవంబరు 5న గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మ్యూజియం సేకరణలు, పురావస్తు ప్రదేశాలు, జ్ఞాన్ భారత్ కార్యక్రమంలో నమోదు చేస్తున్న లిఖిత ప్రతులు, హస్తకళలు, ప్రదర్శన కళలు ఇందులో భాగం.
ఢిల్లీలోని నార్త్, సౌత్ బ్లాకుల్లో రూపుదిద్దుకుంటున్న యుగే యుగీన్ భారత్ మ్యూజియం ఈ భాగస్వామ్యంలో ఒక ప్రధాన అంశం. ఆ భవనాలు, వాటిలో ఉంచదలచిన కళాఖండాల వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేయనున్నట్లు శాఖ తెలిపింది. ఒప్పందం ద్వారా చేపట్టాల్సిన పనులను ప్రకటించింది.

KROV · సంభాషణ
వ్యాఖ్యలు
గౌరవంగా మీ అభిప్రాయాన్ని పంచుకోండి. సమీక్ష తర్వాత వ్యాఖ్యలు కనిపిస్తాయి. వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దు.