దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఐదో డిజిటల్ జీవన ధ్రువపత్రాల కార్యక్రమంలో తొలి ఐదు రోజుల్లో దాదాపు 40 లక్షల ధ్రువపత్రాలు జారీ అయినట్లు కేంద్రం నవంబరు 6న తెలిపింది. గత ఏడాది కార్యక్రమంలో ఇదే వ్యవధిలో సుమారు 25 లక్షల ధ్రువపత్రాలు జారీ అయ్యాయని పేర్కొంది.
ముఖ గుర్తింపు ద్వారా ధ్రువీకరణ చేసుకున్న వాటా గత ఏడాది ఇదే వ్యవధిలో 61 శాతం ఉండగా ఈసారి దాదాపు 80 శాతానికి పెరిగిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఢిల్లీలో విలేకరులకు తెలిపారు. ఈ లెక్కలు కార్యక్రమం తొలి రోజుల్లో జారీ చేసిన ధ్రువపత్రాలకు సంబంధించినవి.

KROV · సంభాషణ
వ్యాఖ్యలు
గౌరవంగా మీ అభిప్రాయాన్ని పంచుకోండి. సమీక్ష తర్వాత వ్యాఖ్యలు కనిపిస్తాయి. వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దు.