బెంగళూరుకు చెందిన ఆస్ట్రోమ్ టెక్నాలజీస్‌కు రూ.64.05 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు ఒప్పందం కుదుర్చుకుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం నవంబరు 12న ప్రకటించింది. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల నిధి నుంచి ఈ సాయం అందించనున్నారు.
ఎలక్ట్రానిక్ నిఘా కోసం ఉపగ్రహ సమూహాన్ని అభివృద్ధి చేయాలనేది సంస్థ ప్రణాళిక అని విభాగం తెలిపింది. ఒప్పందం ప్రకారం ఈ సాయం అవసరమైతే వాటాలుగా మార్చుకునే వీలున్న రుణం రూపంలో ఉంటుంది. ప్రతిపాదిత వ్యవస్థ అభివృద్ధికి, దాని పనితీరును పరీక్షించడానికి ఈ నిధులు ఉపయోగపడతాయి.

KROV · సంభాషణ
వ్యాఖ్యలు
గౌరవంగా మీ అభిప్రాయాన్ని పంచుకోండి. సమీక్ష తర్వాత వ్యాఖ్యలు కనిపిస్తాయి. వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దు.