కర్ణాటకలోని మంగళూరులో నిర్మించిన భూగర్భ ఎల్పీజీ నిల్వ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నవంబరు 13న జాతికి అంకితం చేయనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. ఇందులో 80 వేల మెట్రిక్ టన్నుల ద్రవీకృత పెట్రోలియం వాయువును నిల్వ చేయవచ్చు.
ఈ కేంద్రం నిర్మాణానికి రూ.850 కోట్లకు పైగా ఖర్చయిందని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. భూగర్భంలో ఎల్పీజీ నిల్వ కోసం దేశంలో నిర్మించిన అతిపెద్ద కేంద్రం ఇదేనని పేర్కొంది. నవంబరు 11న ప్రకటించిన ప్రధాని కర్ణాటక పర్యటన కార్యక్రమంలో ఈ అంకితోత్సవం ఉంది.

KROV · సంభాషణ
వ్యాఖ్యలు
గౌరవంగా మీ అభిప్రాయాన్ని పంచుకోండి. సమీక్ష తర్వాత వ్యాఖ్యలు కనిపిస్తాయి. వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దు.