చెన్నై పోర్టులో 12.87 టన్నుల ఎర్రచందనాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నవంబరు 12న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా వెల్లడించింది. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ సుమారు రూ.7.72 కోట్లుగా అంచనా వేసింది.
సరుకును ఓడలోకి ఎక్కించే ముందే అడ్డుకున్నట్లు డీఆర్ఐ తెలిపింది. రక్షిత జాతికి చెందిన ఈ దుంగలను మలేసియాకు తరలించే ప్రయత్నం జరిగిందనేది సంస్థ ప్రాథమిక దర్యాప్తులో చేసిన ఆరోపణ.

KROV · సంభాషణ
వ్యాఖ్యలు
గౌరవంగా మీ అభిప్రాయాన్ని పంచుకోండి. సమీక్ష తర్వాత వ్యాఖ్యలు కనిపిస్తాయి. వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దు.